అన్ క్యాప్డ్ ప్లేయర్‎కు రూ.5.2 కోట్లు పెట్టిన RCB.. అసలు ఎవరీ మంగేశ్ యాదవ్..?

అన్ క్యాప్డ్ ప్లేయర్‎కు రూ.5.2 కోట్లు పెట్టిన RCB.. అసలు ఎవరీ మంగేశ్ యాదవ్..?

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఇండియన్ అన్ క్యాప్డ్ ప్లేయర్ మంగేష్ యాదవ్‎ను డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‎తో వేలంలోకి వచ్చిన ఈ యంగ్ పేసర్‎ను ఏకంగా రూ.5.2 కోట్ల భారీ ధరకు దక్కించుకుంది. మంగేష్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్‎తో ఆర్సీబీ తీవ్రంగా పోటీ పడింది. 

ఇరు ప్రాంఛైజీలు పోటా పోటీగా ధర పెంచుకుంటూ పోవడంతో రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మంగేష్ రూ.5 కోట్లు దాటాడు. రూ.5.2 కోట్ల దగ్గర ఎస్ఆర్‎హెచ్ డ్రాప్ కావడంతో అతడిని ఆర్సీబీ దక్కించుకుంది. అన్ క్యాప్డ్ ప్లేయర్‎కు ఆర్సీబీ ఇంత భారీ ధర వెచ్చించడంతో ఎవరీ మంగేష్ యాదవ్ అనే డిస్కషన్ మొదలైంది.

మంగేష్ యాదవ్ బ్యాగ్రౌండ్: 

మధ్యప్రదేశ్‎కు చెందిన 23 ఏళ్ల మంగేష్ యాదవ్ లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. పదునైన యార్కర్లతో బ్యా్టర్లను ఇబ్బంది పెట్టగలడు. బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం కూడా ఉంది. యశ్ దయాల్‎కు బ్యాకప్‎గా ఈ లెఫ్టార్మ్ యార్కర్ స్పెషలిస్ట్‎ను ఆర్సీబీ కొనుగోలు చేసింది. మధ్యప్రదేశ్ టీ20 లీగ్‎లో గ్వాలియర్ చీతాస్ తరఫున 21 ఓవర్లలో 14 వికెట్లు పడగొట్టి లీగ్‎లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

 ఎంపీ టీ20 లీగ్‌లో తన అద్భుత ప్రదర్శనతో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరఫున మంగేష్ అరంగేట్రం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా రాణించి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించాడు. ఈ క్రమంలోనే మంగేష్‎పై కన్నేసిన ఆర్సీబీ ఎట్టకేలకు వేలంలో రూ.5.2 కోట్ల వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.