మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 11 మంది మావోయిస్టులు లొంగుబాటు పోయారు. లొంగిపోయిన వారిలో డీవీసీఎం, ఏరియా కమిటీ సెక్రటరీ, కమాండర్ స్థాయి మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.68 లక్షల రివార్డు ఉంది. 2025 నుంచి ఇప్పటివరకు 123 మంది లొంగిపోయినట్లు గడ్చిరోలి పోలీసులు వెల్లడించారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానానికి ఆకర్షితులై, హింసా మార్గాన్ని వీడి 11 మంది కీలక మావోయిస్టులు గురువారం(మార్చి19) పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో డివిజనల్ కమిటీ మెంబర్ లాలు అలియాస్ మంగూ పోర్యామి, ఏరియా కమిటీ సెక్రటరీ కమలేష్ అలియాస్ గుండు జుగా మడావిలతో పాటు ఏడుగురు కమాండర్ స్థాయి నేతలు, ఇద్దరు సెక్షన్ స్థాయి సభ్యులు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు.
►ALSO READ | ఎన్నికల బరిలో ఆర్జీకర్ అత్యాచార బాధితురాలి తల్లి.. ఏ పార్టీ నుంచంటే..?
అయితే, లొంగిపోయిన ఈ 11 మంది మావోయిస్టులపై మహారాష్ట్ర ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను ప్రకటించింది. వీరిపై కలిపి మొత్తం రూ.68 లక్షల నగదు రివార్డు ఉంది. 2025 నుంచి ఇప్పటివరకు 123 మంది లొంగిపోయినట్లు వెల్లడించిన గడ్చిరోలి పోలీసులు వెల్లడించారు. అత్యంత కీలకమైన పదవుల్లో ఉన్న వారు లొంగిపోవడంతో గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు నెట్‌వర్క్ మరింత బలహీనపడినట్లయింది.
