క్షౌరం ఏ వారం చేయించుకోవాలి..? ఏ వారం చేయించుకోకూడదు..? ఏ వారం చేయించుకుంటే ఏమవుతుంది..?
ఆదివారం: ఈరోజు క్షౌరం చేయించుకుంటే అనారోగ్యములు
సోమవారం: ఉదయం క్షౌరంతో సుఖసౌఖ్యములు
మంగళవారం: క్షౌరము చేయించుకొంటే ఆపదలు వస్తాయి
బుధవారం: బుధవారం ఉదయం క్షౌరం వలన ఆనందము. ఆరోగ్యము
గురువారం: ఆర్థిక బాధలు కలుగును.
శుక్రవారం: అక్కాచెల్లెల్ల కాపురంలో కలతలు వస్తాయి.
శనివారం: తెలియని తగాదాలు లేక అనారోగ్యము, ఆర్థిక బాధలు
కేశఖండనము: విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిధులు, బుధ, గురు, శుక్రవారములు, అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి, శ్రవణం. ధనిష్ఠ, శతభిష, రేవతి నక్షత్రములు వృషభ, మిధున, కర్కాటక, కన్య, తుల, ధను, మీన లగ్నములు. ఉత్తరాయణము నందు, ఉదయమందు జరిపించవలెను. 9,11 నెలల్లోగాని, 3.5వ సం లలోగాని చేయవలెను. అష్టమశుద్ధి చూసి స్త్రీలకు సరినెలలో జరిపించవలెను. పుణ్యక్షేత్రములలో కూడా జరిపించవచ్చును.
