ఉస్తాద్ భగత్ సింగ్ పబ్లిక్ టాక్.. హరీష్ శంకర్, పవన్ సినిమా హిట్టా.. ఫట్టా..?

ఉస్తాద్ భగత్ సింగ్ పబ్లిక్ టాక్.. హరీష్ శంకర్, పవన్ సినిమా హిట్టా.. ఫట్టా..?

హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకగా విడుదలైంది. శ్రీలీల, రాశీ ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్స్గా నటించారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ జానర్లో ఈ సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కించారు. ఏపీలో ఎర్లీ మార్నింగ్ 5 గంటల షోలు, తెలంగాణలో ఉదయం 7 గంటల మొదటి ఆటతో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. పవన్ కల్యాణ్ అభిమానులు ఈ సినిమా అదిరిపోయిందని చెప్తుంటే.. సగటు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను నాట్ బ్యాడ్ అనేస్తు్న్నారు. గబ్బర్ సింగ్ సినిమా స్థాయిలో అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లేదని కొందరు ప్రేక్షకులు నెట్టింట తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక.. కొందరు మూవీ రివ్యూయర్లు అయితే ఈ సినిమాలో కొత్తదనం లేదని పెదవి విరిచారు. కమర్షియల్ ఎంటర్ టైనర్ను తెరకెక్కిస్తున్నానని భావించిన హరీష్ శంకర్ పూర్తిగా ఒక ఔట్డేటెడ్ సబ్జెక్ట్ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడని చెప్పుకొచ్చారు. అయితే.. స్వతహాగా పవన్ వీరాభిమాని కావడంతో ఫ్యాన్స్ పల్స్ బాగా తెలిసిన హరీష్ శంకర్.. పవన్ కల్యాణ్ ఎలివేషన్ బ్లాక్స్ను మాత్రం అద్భుతంగా చూపించాడని చెప్పారు.

ఒక్కమాటలో చెప్పాలంటే పవన్ కల్యాణ్ అభిమానులకు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చుతుందని తేలిపోయింది. ఇక.. సగటు సినీ ప్రేక్షకులను థియేటర్ల వరకూ రప్పించగలిగే పరిస్థితి ఉంటుందో.. లేదో.. తెలియాలంటే డే1 షోస్ కంప్లీట్స్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. మొదటి రోజు థియేటర్లన్నీ దాదాపుగా అభిమానులతో నిండిపోతాయి. రెండో రోజు, మూడో రోజు నుంచే స్టార్ హీరోల సినిమాల భవితవ్యం తేలుతుంది.

ఉగాది, రంజాన్ పండుగల సెలవులు ఉండటంతో పవన్ కల్యాణ్ సినిమాకు ప్రేక్షకులు ఆశించిన స్థాయిలోనే వెళ్లే అవకాశాలున్నాయి. ‘ధురంధర్’2 సినిమా ఫలితం ప్రభావం దాదాపుగా ఉస్తాద్ భగత్ సింగ్పై ఉండకపోవచ్చు. ‘ధురంధర్’2 సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు. పండుగకు ఒక ఎంటర్టైనర్ చూసి సరదాగా గడపాలనే ప్రేక్షకులకు ప్రస్తుతం ఉన్న ఆప్షన్ ఉస్తాద్ భగత్ సింగ్.