దక్షిణమధ్య రైల్వే అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 11.
మొత్తం ఖాళీలు: 2801. అప్రెంటిస్.
విభాగాల వారీగా ఖాళీలు: ఏసీ మెకానిక్ 251, కార్పెంటర్ 22, సీఓపీఏ 181, డీజిల్ మెకానిక్ 105, ఎలక్ట్రీషియన్ 1258, ఎలక్ట్రానిక్ మెకానిక్ 88, ఫిట్టర్ 539, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ 33, మెషినిస్ట్ 54, ఎంఎంటీఎం 24, మోటార్ మెకానిక్ 12, పెయింటర్ 32, వెల్డర్ 202.
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో 10+2/ ఇంటర్మీడియట్పూర్తిచేసి ఉండాలి.
ఎన్సీవీటీ/ ఎస్సీవీటీ గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏసీ మెకానిక్, కార్పెంటర్, సీఓపీఏ, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్, ఎంఎంటీఎం, మోటార్ మెకానిక్ వెహికల్, పెయింటర్, వెల్డర్ విభాగాల్లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అప్రెంటీస్ యాక్ట్ ప్రకారం ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేయడానికి అర్హులు కాదు.
వయోపరిమితి: 15 నుంచి 24 ఏండ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 12.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీబీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.100.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 12.
సెలెక్షన్ ప్రాసెస్: ఎలాంటి రాత పరీక్ష గానీ ఇంటర్వ్యూ గానీ ఉండదు. పూర్తి అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 10వ తరగతి, ఐటీఐలో సాధించి మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ ను scr.indianrailways.gov.in సందర్శించండి.
