సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: తెలంగాణలో కాంగ్రెస్ నిరసనలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: తెలంగాణలో కాంగ్రెస్ నిరసనలు

కేంద్ర ఎన్నికల సంఘం  ప్రధాన కార్యదర్శి జ్ణానేశ్ కుమార్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా మరోసారి నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో  కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం తీరును వ్యతిరేకిస్తూ,  ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన  సీఈసీ జ్ణానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ  కాంగ్రెస్ నేతృత్వంలో ఆందోళనలు చేపట్టారు.  నిరసనల్లో భాగంగా హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.   

సోమవారం (సెప్టెంబర్ 28) టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ ఆందోళన నిర్వహించారు. నెక్లెస్ రోడ్డు నుంచి  ఈసీ ఆఫీసు వరకు భారీర్యాలీగా తరలివెళ్లారు. ఈ నిరసనలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ..  ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు పారదర్శకత, జవాబుదారీతనం అవసరమని స్పష్టం చేశారు. సీఈసీపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.