యూత్ అండ్ ఫ్యామిలీ టార్గెట్‌గా '321'.. ఆకట్టుకుంటున్న 'నను తాకిన' మెలోడీ సాంగ్!

యూత్ అండ్ ఫ్యామిలీ టార్గెట్‌గా '321'.. ఆకట్టుకుంటున్న 'నను తాకిన' మెలోడీ సాంగ్!

ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? ఈ రెండింటిలో ఏది బెస్ట్.. అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ '321' (లవ్ మ్యారేజ్ వర్సెస్ అరెంజ్డ్). బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై శాంతి కుమార్ చిలుముల, రామానుజ రెడ్డి వంగపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శాంతి కుమార్ చిలుములే దర్శకత్వం వహించారు. 

మోహిత్, లావణ్య నూతన జంటగా పరిచయమవుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. అక్టోబర్ చివరి వారంలో థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ల జోరు పెంచారు మేకర్స్. లేటెస్ట్ గా 'నను తాకిన'అనే మెలోడియస్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టారు.

కాల్విన్ జాయ్ అందించిన మనసును హత్తుకునే బాణీ, సాయి చరణ్ - హరిణిల మధురమైన గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. దర్శకుడు శాంతి కుమార్ చిలుముల స్వయంగా రాసిన సాహిత్యం ప్రేమికుల హృదయాలను తాకేలా ఉంది.  ఈ చిత్రంలో వివాన్ సూర్య, లక్ష్మీ వెన్నెల, యామిని, శ్రీనివాస్ భోగిరెడ్డి, ప్రభావతి, మాధవి, విద్యా సాగర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శివ ప్రసాద్ ముప్పాల విజువల్స్, శివ శర్వాణి ఎడిటింగ్ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయి.