రష్మిక మా ఊరి కోడలు: గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్‎లో సీఎం రేవంత్

రష్మిక మా ఊరి కోడలు: గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్‎లో సీఎం రేవంత్

హైదరాబాద్: గద్దర్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గానూ ఉత్తమ నటిగా స్టార్ హీరోయిన్ రష్మిక మందనా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రష్మికకు బెస్ట్ ఫీమేల్ యాక్టర్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి అవార్డ్ అందజేశారు. అవార్డ్ ప్రదానోత్సవం సందర్భంగా రష్మిక మందనా మా ఊరి కోడలు అని యాంకర్ సుమకు చెప్పారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డ్ అందుకోవడం చాలా స్పెషల్ అని అన్నారు. 

ఇక, హైదరాబాద్‎లోని హైటెక్స్‎లో గద్దర్ అవార్డుల ప్రధానోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, నటులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి దంపతులు, విశ్వ నటుడు కమల్ హాసన్, అక్కినేని నాగార్జున దంపతులు, రాం చరణ్, ఖుష్బూ, అక్కినేని నాగచైతన్య దంపతులు, అల్లు అరవింద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. 

►ALSO READ | Mohan Babu : 'శికంజా మాలిక్'గా మోహన్ బాబు విధ్వంసం.. నాని 'ది ప్యారడైజ్' నుంచి గ్లింప్స్ రిలీజ్!.

ఈ కార్యక్రమంలో వనజ ఉదయ్ డాన్స్ గ్రూప్ తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా చేసిన డ్యాన్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. అదే విధంగా ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్, రాక్ స్టార్ దేవి ప్రసాద్, ఫోక్ సింగర్ మంగ్లీ తమ గళంతో అలరించారు.