ఉగాది రోజున భారీగా తగ్గిన గోల్డ్.. వెండి రేటు ఎంత పడిపోయిందంటే..?

ఉగాది రోజున భారీగా తగ్గిన గోల్డ్.. వెండి రేటు ఎంత పడిపోయిందంటే..?

ఒకపక్క ఇరాన్ వార్ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ బంగారం, వెండి రేట్లు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ఉగాది పండుగ రోజున బంగారం భారీగా తగ్గుముఖం పట్టడంతో రిటైల్ కొనుగోలుదారులు చాలా మంది షాపింగ్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు వెండి రేట్లు కూడా స్థిరంగా తగ్గుతుండటంతో చాలా మంది కొత్త కొనుగోళ్లకు మెుగ్గుచూపుతున్నారు. అయిదే ముందుగా మీ నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలించటం ముఖ్యం.

మార్చి 19న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. మార్చి 18 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.278 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 464గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 175గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

బుధవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మార్చి 19, 2026న దేశవ్యాప్తంగా రూ.5వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.10వేలు తగ్గి రూ.2లక్షల 65వేల వద్ద కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.265 వద్ద ఉంది.