ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రంపై ఇరాన్ దాడి.. భారత్ పై తీవ్ర ప్రభావం!

ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రంపై ఇరాన్ దాడి.. భారత్ పై తీవ్ర ప్రభావం!

ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విడ్ నాచురల్ గ్యాస్ కేంద్రం అయిన  ఖతార్ లోని రాస్ లఫాన్ పై ఇరాన్ క్షిపణి దాడితో ప్రపంచ చమురు, గ్యాస్ మార్కెట్లు మరింత గందరగోళంలో పడ్డాయి. ఇరాన్ క్షిపణి  దాడితో ప్రపంచంలోని  అత్యంత కీలకమైన ఇందన కేంద్రాలలో ఒకటైన  రాస్ లఫాన్ లో చమురు, గ్యాస్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గల్ఫ్ దేశాల్లోని  అమెరికా  సైనిక స్థావరాలతోపాటు చమురు  కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ లోని సౌత్ పార్స్ గ్యాస్ కేంద్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. 

చమురు సంక్షోభం మరింత తీవ్రం..

అమెరికా, రష్యాలతోపాటు ప్రపంచంలోని అగ్రశ్రేణి LNG ఎగుమతి దారులలో  ఖతార్ ఉందంటే అది రాస్ లఫాన్ కీలకం. మార్చి మొదటి వారంలో ఖతార్ కేంద్రాలపై ఇరాన్ దాడులు జరిపిన తర్వాత ఇది రెండోది. ఇరాన్ దాడులతో ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. 

భారత్ పై ప్రభావం.. 

ఖతార్ లోని రాస్ లఫాన్ పై ఇరాన్ దాడితో ఆ కేంద్రం మూతపడడంతో LNG దిగుమతి చేసుకునే భారత్ తో పాటు ఇతర దేశాలపై  ప్రభావం చూపనుంది. భారత్ గ్యాస్ అవసరాలను 50 శాతం వరకు  దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది.  ఇందులో ఎక్కువ భాగం వాటా ఖతార్ నుంచి ఉంది. భారత్ కు LNG దిగుమతులలో దాదాపు 40 శాతం ఖతార్ నుంచి  వస్తున్నాయి. ఇది మొత్తం గ్యాస్ వినియోగంలో దాదాపు 20 శాతానికి సమానం. 

►ALSO READ | మనోళ్ల సివిక్ సెన్స్కు యూకే బహుమానం! పాన్ ఉమ్మేసినందుకు మూడున్నర లక్షల ఫైన్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఆ ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. రోజుకు 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  మొత్తం గ్యాస్ వినియోగం 189MMSCMD ఉండగా దేశీయ ఉత్పత్తి 97.5189MMSCMD  గా ఉంది.  మిగతాదంతా  ఇతర దేశాలనుంచి దిగుమ చేసుకుంటోంది భారత్. 

 పశ్చిమాసియా సంక్షోభంతో LNG  సరఫరా సురక్షితం చేసుకునేందుకు పారిశ్రామిక, విద్యుత్ రంగాలలో గ్యాస్ వినియోగం  తగ్గించాల్సి రావచ్చన  నిపుణులు  హెచ్చరిస్తున్నారు.  ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు ఇప్పటికే కొత్త మార్కెట్ల నుండి కార్గోలను సేకరించడం ప్రారంభించాయి.

కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడులు జరుగుతుండటం, నౌకా రవాణా మార్గాలకు ముప్పు వాటిల్లుతుండటంతో ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ప్రభావం పశ్చిమాసియా దేశాలపైనా ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో దీర్ఘకాలిక అస్థిరతపై ఆందోళనలను పెంచుతోంది.