సివిక్ సెన్స్ మనోళ్లకు ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అదేనండీ మనం చేసే పనుల వలన సాటి మనిషికి.. అంటే మన పక్కనోళ్లకు ఎంత ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన. ఆ సెన్స్ లేకే ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది పడేయటం. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్, బస్టాండ్స్, రోడ్లు.. ఇలా ప్లేస్ ఏదైనా సరే తుప్ప తుప్ప ఉమ్మేస్తూ పరిసరాలను అష్టదరిద్రంగా మార్చడంలో మనోళ్లకు మనోళ్లే సాటి. ఓరే నాయనా ఇది హాస్పిటల్.. ఎందుకలా ఉమ్మేస్తున్నావ్ అంటే.. నీకేమైందిరా బై.. అనే వాళ్లు హైదరాబాద్ లాంటి సిటీల్లో కోకొల్లలు. ఇండియాలో అయితే నడుస్తుంది.. ఫారిన్ లో కూడా ఇలాగే ప్రవర్తిస్తామంటే చెల్లుతుందా..? లండన్ లో మనోళ్లు చేసిన పనికి ఏం జరిగిందో మీర చదవండి.
లండన్ లోని బ్రెంట్ బరోలో బహిరంగంగా పాన్ ఉమ్మేసినందుకు ఒక్కొక్కరికి 1391 పౌండ్స్ ఫైన్ విధించి షాకిచ్చారు లండన్ అధికారులు. అంటే ఇద్దరికీ కలిపి 3 లక్షల 46 వేల రూపాయల జరిమానా వేసినట్లు యూకే స్థానిక న్యూస్ హరో ఆన్ లైన్ వెల్లడించింది.
యూకేలో పబ్లిక్ స్థాలలలో పాన్ ఉమ్మేసేవారి సంఖ్య పెరిగిపోతుండటంతో ఇటీవలే చర్యలకు ఉపక్రమించింది అక్కడి ప్రభుత్వం. పాన్ ఉమ్మివేతలకు వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అందుకోసం ఏడాదికి 30 వేల పౌండ్స్ అంటే 37 లక్షలకు పైగా ఖర్చు చేసి పాన్ ఉమ్మివేతను నివారించడం, అలాంటి స్థలాలను పరిశుభ్రంగా మార్చడం అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో సిటీని క్లీన్ గా ఉంచేది పోయి.. పాన్ ఉమ్మివేయడమేంటని ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు ఫైన్ వేశారు. మొదట 100 పౌండ్స్ (రూ.12,371) ఫైన్ వేయగా నిందితులు చెల్లించలేకపోయారు. దీంతో ఆగ్రహించిన అధికారులు ఒక్కొక్కరికి 1391 పౌండ్స్ జరిమానాను విధించారు.
ఎడ్గవేర్ టౌన్ లో ఉండే అక్షిత్ కుమార్ భంద్రే పటేల్ కకు నార్త్ వెస్ట్ లండన్ మెజిస్ట్రేట్స్ కోర్టు జరిమానా విధించింది. 2025 జూన్ లో కింగ్స్ బరీ రోడ్డుపై లోకల్ మెట్రో స్టేషన్ లో ఉమ్మేసినందుకు శిక్ష విధించారు. అయితే కోర్టు హియరింగ్ కు హాజరు కావాల్సి ఉండగా.. హాజరు కాకపోవడంతో వాయిదా వేసిన కోర్టు.. లేటెస్టుగా ఫైన్ పెంచి షాకిచ్చింది.
సేమ్ ఇలాంటి కేసు హరీష్ పటేల్ అనే రూయి స్లిప్ లో ఉండే..వ్యక్తికి ఎదురైంది. వెంబలే హిల్ రోడ్ పై ఉమ్మివేసినందుకు శిక్షగా 1391 పౌండ్స్ జరిమానా విధించింది.
లండన్ లో పాన్ పరాక్ బ్యాచ్ ఎలా తయారైందో ఈ ఘటనల ద్వారా అర్థమవుతంది. హరో న్యూస్ చానెల్ లో టెలికాస్ట్ చేసిన తర్వాత ఈ అంశంపై దేశ వ్యాప్తం చర్చ పెరుగోంది. మరోవైపు కేబినెట్ మెంబర్ క్రుపా షేత్ మాట్లాడుతూ.. కౌన్సిల్ ఈ అంశంపై కఠినంగా ఉంది. వీధులను పాన్ తో అపరిశుభ్రం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్తున్నాం.. అంటూ ప్రకటించారు.
