ఇరాన్ మా పంట ఉత్పత్తులు కొనాల్సిందే.. ఆ నిధులు నేరుగా ఇవ్వం: ట్రంప్

ఇరాన్ మా పంట  ఉత్పత్తులు కొనాల్సిందే..  ఆ నిధులు నేరుగా ఇవ్వం: ట్రంప్

వాషింగ్టన్‌‌‌‌: వివిధ దేశాల్లో స్తంభింపచేసిన 12 బిలియన్‌‌ డాలర్ల ఇరాన్‌‌ నిధులను విడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్‌‌ డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ శుక్రవారం ప్రకటించారు. అయితే, ఆ నిధులను నేరుగా ఇరాన్‌‌కు అప్పగించబోమని ఆయన స్పష్టం చేశారు. 

ఇరాన్‌‌లో ఆహార కొరతను తీర్చేందుకు అమెరికా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని తెలిపారు. కాగా, ట్రంప్‌‌ నిర్ణయాన్ని ఇరాన్‌‌ తిరస్కరించింది. ఆ నిధులను ఎలా వినియోగించాలనేది పూర్తిగా తమ నిర్ణయమేనని స్పష్టం చేసింది. ధర, నాణ్యత ఆధారంగానే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ఉంటుందని తెలిపింది.