తెలంగాణ ప్రభుత్వానికి అమెరికా ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్ లోని రోడ్డుకు తన పేరు పెట్టడంపై హర్షించారు. ఈ గౌరవం పొందిన తొలి యూఎస్ ప్రసిడెంట్ తానేనని తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు.
హైదరాబాద్ లో యూఎస్ కాన్సులేట్ దగ్గర ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని ప్రభుత్వం పేరు పెట్టింది. దీనికి సంబంధించి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, యూఎస్ రాయబారి సెర్జియో గొర్ ప్రారంభించిన ఫోటోను షేర్ చేస్తూ.. థ్యాంక్యూ.. ఈ గౌరవం దక్కిన తొలి ప్రసిడెంట్ తానేననంటూ పోస్ట్ చేశారు.
హైదరాబాద్ లో అమెరికా కంపెనీలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాస్ట్ ఆఫీసులున్న దగ్గరనే డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ రోడ్ ఉండటం గమనార్హం. యూఎస్–ఇండియా రిలేషన్స్ కు గుర్తింపుగా.. గౌరవార్ధంగా ఈ పేరును పెట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
జూన్ 23న ఈ రోడ్డును ప్రారంభించారు. గ్లోబల్ సమ్మిట్ కు ముందు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టటం ఆసక్తికర అంశం.
ఐటీ రంగానికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ సిటీలో అంతర్జాతీయ సంస్థలను, దేశాలను గుర్తించే ప్రక్రియలో భాగంగా నామకరణం చేశారు. రాబోయే రోజుల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల పేర్లను కూడా పెట్టే ప్రతిపాదనలు చేస్తోంది ప్రభుత్వం.
