తుపాకుల మోతతో దద్దరిల్లిన ఢిల్లీ.. ఒకే ఇంట్లో నలుగురిపై కాల్పులు.. పదేళ్ల బాలుడు మృతి

తుపాకుల మోతతో దద్దరిల్లిన ఢిల్లీ.. ఒకే ఇంట్లో నలుగురిపై కాల్పులు.. పదేళ్ల బాలుడు మృతి

న్యూఢిల్లీ: ఉగాది పర్వదినాన దేశ రాజధాని ఢిల్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. బైక్‎పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి చొరబడి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఢిల్లీలోని బవానా ప్రాంతంలో గురువారం (మార్చి 19) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం బవానా ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని దుండగులు మోటార్‌సైకిల్‌పై వచ్చి ఓ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పలు రౌండ్లు జరిపిన కాల్పుల్లో ఇంట్లో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. పదేళ్లు బాలుడు తీవ్రంగా గాయపడి మరణించగా.. అతని తండ్రి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. 

►ALSO READ | మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ.. గడ్చిరౌలిలో 11మంది లొంగుబాటు

మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ ఘటనకు గ్యాంగ్ వార్ కారణం కావొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిలో టిల్లు గ్యాంగ్ ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగిన వెంటనే ఢిల్లీ పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించాయి. ఘటన స్థలంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. తుపాకుల మోతతో బవానా ప్రాంతం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.