Live : IPLలో ఆటగాళ్ల వేలం.. ఎవరికి ఎంత ధర పలికింది..!

Live : IPLలో ఆటగాళ్ల వేలం.. ఎవరికి ఎంత ధర పలికింది..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. IPL మినీ వేలం స్టార్ట్ అయ్యింది. అబుదాబిలో క్రికెటర్లను వేలం పాటలో కొనుగోలు చేస్తున్నాయి ఫ్రాంచైజీలు. వేలంలో 10 జట్లలో ఖాళీగా ఉన్న 77 మంది ఆటగాళ్లను.. 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి. 350 మంది క్రికెటర్లు సిద్ధంగా ఉండగా.. దీని కోసం 237 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నాయి ఆయా ఫ్రాంచైజీ యాజమాన్యాలు

  • సార్థక్ రంజన్ను రూ. 30 లక్షల బేస్ ధరకు తీసుకున్న KKR
  • దక్ష్ కమ్రాను రూ. 30 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసిన KKR
  • విదర్భ క్రికెటర్ ప్రఫుల్ హింజ్ను 30 లక్షల బేస్ ప్రైస్కు కొన్న సన్ రైజర్స్ హైదరాబాద్
  • 30 లక్షలకు సౌరాష్ట్ర స్పిన్నర్ క్రెయిన్స్ ఫులేట్రాను కొన్న SRH
     
  • హిమాచల్ ప్రదేశ్ క్రికెటర్ అమిత్ కుమార్ను 30 లక్షలకు కొన్న SRH
  • ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కూపర్ కొన్నోలీని 3 కోట్లకు కొనుగోలు చేసిన PBKS
  • యువ పేసర్ మహ్మద్ ఇజర్ను 30 లక్షల బేస్ ప్రైస్ కు దక్కించుకున్న ముంబై ఇండియన్స్
  • బీహార్ క్రికెటర్ షకీబ్ హుస్సేన్ ను 30 లక్షలకు కొన్న SRH
  • ఓంకార్ తర్మలేను 30 లక్షలకు కొనుగోలు చేసిన SRH
  • ఉత్తర్ ప్రదేశ్ క్రికెటర్ రవి సింగ్ను 95 లక్షలకు కొన్న రాజస్తాన్ రాయల్స్
  • పంజాబ్ క్రికెటర్, బ్యాటర్ సలిల్ అరోరాను కోటిన్నరకు దక్కించుకున్న SRH.. బేస్ ప్రైస్ 30 లక్షలు
  • మధ్యప్రదేశ్ క్రికెటర్, బౌలర్ మంగేష్ యాదవ్ను 5.2 కోట్ల రికార్డ్ ధరకు కొనుగోలు చేసిన RCB
  • పుదుచ్చేరి క్రికెటర్ సాత్విక్ దేశ్వాల్ను 30 లక్షల బేస్ ప్రైస్కు కొన్న RCB
  • మధ్యప్రదేశ్ బ్యాటర్ అక్షత్ రఘువన్షీని 2.2 కోట్లకు సొంతం చేసుకున్న LSG 
  • విదర్భ బ్యాటర్ డానిష్ మలేవార్ను 30 లక్షల బేస్ ప్రైస్కు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్
  • బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తఫిజుర్ రెహ్మాన్ను 9.2 కోట్లకు కొన్న KKR
  • సౌతాఫ్రికా బౌలర్ లుంగీ ఎంగ్డీ అన్ సోల్డ్.. బేస్ ప్రైస్ 2 కోట్లకు ముందుకు రాని ఫ్రాంచైజీలు
  • న్యూజిలాండ్ క్రికెటర్ టిమ్ సీఫెర్ట్ను కోటిన్నరకు సొంతం చేసుకున్న KKR
  • వెస్టీండిస్ ఆల్ రౌండర్ హోల్డర్ను ఒడిసిపట్టిన గుజరాత్ టైటాన్స్.. 7 కోట్లకు వేలంలో దక్కించుకున్న GT
  • KKR టీంలోకి రాహుల్ త్రిపాఠి రీఎంట్రీ.. 75 లక్షల బేస్ ప్రైస్కు కొనుగోలు చేసిన KKR
  • శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంకను 4 కోట్లకు కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
  • కేరళ స్పిన్ బౌలర్ విఘ్నేష్ పుత్తూర్ను 30 లక్షల బేస్ ప్రైస్కు దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్
  • కర్ణాటక యువ క్రికెటర్ యష్ రాజ్ పుంజను 30 లక్షల బేస్ ప్రైస్ కు సొంతం చేసుకున్న RR
  • జార్ఖండ్ బౌలర్ సుశాంత్ మిశ్రాను 90 లక్షలకు దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్
  • కార్తీక్ త్యాగిని 30 లక్షల బేస్ ప్రైస్కు సొంతం చేసుకున్న LSG
  • Left-arm seamer నమన్ తివారిని కోటి రూపాయలకు దక్కించుకున్న LSG
  • మధ్యప్రదేశ్ బౌలర్ అశోక్ శర్మను 90 లక్షలకు దక్కించుకున్న గుజరాత్ టైటాన్స్ (GT).. బేస్ ప్రైస్ 30 లక్షలు.. 2022లో 55 లక్షలకు అశోక్ శర్మను కొనుగోలు చేసిన కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR).. 2025 ఐపీఎల్ సీజన్ మెగా ఆక్షన్లో 30 లక్షల బేస్ ప్రైస్కు కొన్న RR.
  • మధ్యప్రదేశ్ బ్యాటర్ శివంగ్ కుమార్ ను 30 లక్షల బేస్ ప్రైస్ కు కొనుగోలు చేసిన SRH 
  • రాజస్తాన్ బ్యాటర్ ముకుల్ చౌదరిని రూ. 2.6 కోట్లకు సొంతం చేసుకున్న LSG.. బేస్ ప్రైస్ 30 లక్షలు
  • కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్.. Uncapped ప్లేయర్ల కోసం 28 కోట్ల 40 లక్షల రూపాయలు వెచ్చించిన చెన్నై సూపర్ కింగ్స్.. చెరో రూ.14.20 కోట్లు వేలం పాడి ఇద్దరినీ దక్కించుకున్న CSK
  • రాజస్థాన్ క్రికెటర్, సిక్స్ హిట్టింగ్ మెషీన్గా పేరు తెచ్చుకున్న బ్యాటర్ కార్తీక్ శర్మను రూ.14.2 కోట్లకు దక్కించుకున్న CSK
  • స్పిన్ బౌలింగ్, ఆల్ రౌండర్ విభాగంలో జడేజా స్థానాన్ని భర్తీ చేస్తాడని బలంగా నమ్మి ప్రశాంత్ వీర్పై రూ.14.2 కోట్లు వెచ్చించిన CSK
  • యూపీ స్పిన్ బౌలర్ కమ్ ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ ను రూ. 14.20 కోట్లకు కొనుగోలు చేసిన CSK.. సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో రాణించిన ప్రశాంత్ వీర్ ను దక్కించుకున్న చెన్నై
  • 30 లక్షల బేస్ ప్రైస్ క్రికెటర్ ప్రశాంత్ వీర్ కోసం కోట్లు వెచ్చిస్తున్న యాజమాన్యాలు
  • యూపీ యువ క్రికెటర్ ప్రశాంత్ వీర్ కోసం పోటీ పడుతున్న ఫ్రాంచైజీలు
     
  • టీమిండియా ఆల్ రౌండర్ మహిపాల్ లామ్రోర్ అన్ సోల్డ్
  • టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్ అన్ సోల్డ్
  • జమ్ము కశ్వీర్ బౌలర్, యువ ఆటగాడు అఖ్వీబ్ నబీని 8.4 కోట్లకు దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. 30 లక్షల బేస్ ప్రైస్ తో వచ్చి 8 కోట్లకు పైగా రికార్డు ధర పలికిన అఖ్వీబ్ నబీ
  • ఇప్పటిదాకా జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో టాప్ 5లో ఇద్దరు టీమిండియా క్రికెటర్లు.. రవి బిష్ణోయిని 7.20 కోట్లకు దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్.. వెంకటేష్ అయ్యర్ ను రూ.7 కోట్లకు దక్కించుకున్న RCB
  • ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్‌హక్ ఫారూఖీని కొనేందుకు ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు.. బేస్ ప్రైస్ కోటి రూపాయలు.. గత సీజన్స్లో SRH, RR టీమ్స్లో ఆడిన ఫారూఖీ
  • ఆస్ట్రేలియా క్రికెటర్ స్పెన్సర్ జాన్సన్ అన్ సోల్డ్.. బేస్ ప్రైస్ కోటిన్నర.. గతంలో KKRలో ఆడిన జాన్సన్
  • సౌతాఫ్రికా క్రికెటర్ గెరాల్డ్ కోట్జీ అన్ సోల్డ్.. బేస్ ప్రైస్ 2 కోట్లు
  • టీమిండియా యువ క్రికెటర్స్ యష్ ధుల్, ఆర్య దేశాయి అన్ సోల్డ్.. 30 లక్షల బేస్ ప్రైస్ కూడా పెట్టేందుకు ముందుకు రాని ఫ్రాంచైజీలు
  • టీమిండియా ఆటగాళ్లకు ఐపీఎల్ మినీ వేలంలో చుక్కెదురు.. అధర్వ థైదే, అన్మోల్ ప్రీత్ సింగ్, అభినవ్ తేజ్ రానా, అభినవ్ మనోహర్ అన్ సోల్డ్
  • వెస్టిండీస్ క్రికెటర్ అకీల్ హుస్సేన్ను 2 కోట్ల బేస్ ప్రైస్కు దక్కించుకున్న CSK
  • అన్మోల్ ప్రీత్ సింగ్ అన్ సోల్డ్.. 30 లక్షల బేస్ ప్రైస్ కూడా పెట్టని ఫ్రాంచైజీలు
  • ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్రీన్, శ్రీలంక బౌలర్ పతిరనా కోసం రూ.43.2 కోట్లు వెచ్చించిన కోల్ కత్తా నైట్ రైడర్స్.. ఇప్పటికి భారీ ధర పలికిన టాప్ 1, టాప్ 2 ఆటగాళ్లు వీళ్లే
  • ఆప్ఘన్ బౌలర్ ముజీబ్ రెహ్మాన్ ను 2 కోట్ల బేస్ ప్రైస్ కు కూడా కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు
  • శ్రీలంక బౌలర్ మహీషా తీక్షణ అన్ సోల్డ్.. బేస్ ప్రైస్ 2 కోట్లు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
  • రవి బిష్ణోయిని 7.2 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్
  • టీమిండియా బౌలర్ రవి బిష్ణోయి కోసం పోటీపడుతున్న ఫ్రాంచైజీలు.. చెన్నై, రాజస్థాన్, హైదరాబాద్ ఫ్రాంచైజీల మధ్య పోటాపోటీగా వేలం
  • సౌతాఫ్రికా బౌలర్ నోర్జేను 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన LSG
  • టీమిండియా స్పిన్నర్ రాహుల్ చాహర్ అన్ సోల్డ్.. బేస్ ప్రైస్ కోటి రూపాయలకు కూడా కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు
  • న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ అన్ సోల్డ్
  • శ్రీలంక పేసర్ మతీషా పతిరనాను రూ.18 కోట్లకు దక్కించుకున్న KKR. మతీషా కోసం చివరి వరకు వేలంలో పోటాపోటీగా పాల్గొన్న ఢిల్లీ, లక్నో ఫ్రాంచైజీలు. 15 కోట్ల వరకు వచ్చిన లక్నో. చివరకు 18 కోట్లతో జట్టులోకి తీసుకున్న కోల్ కతా నైట్ రైడర్స్.
  • న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫ్ఫీని రూ. 2 కోట్ల బేస్ ప్రైస్కు సొంతం చేసుకున్న RCB
  • ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ మాజీ విన్నర్ శివం మావి అన్ సోల్డ్
  • ఆకాష్ దీప్ అన్ సోల్డ్.. గత IPL సీజన్లో రూ. 8.25 కోట్లు పలికిన ప్లేయర్ వైపు కన్నెత్తి చూడని ఫ్రాంచైజీలు
  • న్యూజిలాండ్ క్రికెటర్ ఫిన్ అలెన్ను బేస్ ప్రైస్ 2 కోట్లకు దక్కించుకున్న KKR
  • ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ డకెట్ను బేస్ ప్రైస్ 2 కోట్లకు సొంతం చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • క్వింటన్ డీ కాక్ను కోటి రూపాయలకు దక్కించుకున్న ముంబై ఇండియన్స్ (MI)
  • ఇంగ్లండ్ ఆటగాడు జెమి స్మిత్ అన్ సోల్డ్.. టాలెంటెడ్ ప్లేయర్ వైపు కన్నెత్తి చూడని ఫ్రాంచైజీలు
  • గుర్భాజ్ను దక్కించుకునేందుకు ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు
  • బెయిర్ స్ట్రో అన్ సోల్డ్.. ఆసక్తి చూపని ఫ్రాంచైజీలు.. బేస్ ప్రైస్ కోటి రూపాయలు
  • తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ అన్ సోల్డ్.. బేస్ ప్రైస్ 75 లక్షలకు కూడా కొనుగోలు చేయని ఫ్రాంచైజీలు
     
  • ఆల్ రౌండర్ దీపక్ హుడా అన్ సోల్డ్.. 75 లక్షల బేస్ ప్రైస్ వెచ్చించేందుకు ముందుకు రాని ఫ్రాంచైజీలు
  • వెంకటేష్ అయ్యర్ ను ఏడు కోట్లకు దక్కించుకున్న RCB
  • శ్రీలంక క్రికెటర్ హసరంగను 2 కోట్ల బేస్ ప్రైస్ కు దక్కించుకున్న LSG
  • ఇంగ్లండ్ ఆల్ రౌండర్ గస్ ఆట్కిన్ సన్ అన్ సోల్డ్.. బేస్ ప్రైస్ 2 కోట్లు
  • ​​​​​ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ ను 2 కోట్ల రూపాయల బేస్ ప్రైస్ కు కొనడానికి కూడా ముందుకు రాని ఫ్రాంచైజీలు
  • న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రను బేస్ ప్రైస్ 2 కోట్ల రూపాయలకు కూడా కొనని ఫ్రాంచైజీలు
  • మిగిలిన మొత్తాన్ని ప్లేయర్స్ వెల్ఫేర్కు ఖర్చు చేయనున్న BCCI
  • ఈ రూల్ ప్రకారం.. గ్రీన్కు చెల్లించే మొత్తం రూ. 18 కోట్లే
  • మినీ ఆక్షన్లో 18 కోట్లకు మించి ఓవర్సీస్ ఆటగాళ్లకు వెచ్చించకూడదని ఐపీఎల్ ‘మ్యాక్జిగమ్ ఫీ రూల్’
  • రూ. 25.2 కోట్లకు గ్రీన్ అమ్ముడుపోయినా అతనికి దక్కేది రూ.18 కోట్లే !
  • 75 లక్షల బేస్ ప్రైస్ కు కూడా అమ్ముడుపోని సర్ఫరాజ్ ఖాన్
  • కామెరాన్ గ్రీన్ ను రూ. 25.20 కోట్ల రికార్డ్ ధరకు సొంతం చేసుకున్న KKR
  • కామెరాన్ గ్రీన్ కోసం CSK, KKR జట్ల మధ్య పోటాపోటీ వేలం
  • గ్రీన్ను సొంతం చేసుకునేందుకు రూ.13.80 కోట్లు వేలం పాడిన చెన్నై సూపర్ కింగ్స్
  • ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కోసం ఐపీఎల్ జట్ల పోటాపోటీ వేలం
  • టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా బేస్ ధర రూ.  75 లక్షలు ఆక్షన్ లోకి వచ్చి అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. 
     
  • డేవిడ్ మిల్లర్ ను బేస్ ప్రైజ్ 2 కోట్ల రూపాయలకే దక్కించుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
  • ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ ప్రారంభమైంది. మంగళవారం (డిసెంబర్ 16) ప్రారంభమైం ఈ మినీ వేలంలోకి తొలి ప్లేయర్ గా ఆస్ట్రేలియా చిచ్చర పిడుగు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.