IPL 2026 Mini-auction: పృథ్వీ షా, సర్ఫరాజ్‌లకు బిగ్ షాక్.. తొలి గంటలో నలుగురు టీమిండియా క్రికెటర్లు అన్ సోల్డ్

IPL 2026 Mini-auction: పృథ్వీ షా, సర్ఫరాజ్‌లకు బిగ్ షాక్.. తొలి గంటలో నలుగురు టీమిండియా క్రికెటర్లు అన్ సోల్డ్

ఐపీఎల్ మినీ వేలం 2026లో తొలి గంటలో భారత క్రికెటర్లకు నిరాశే మిగిలింది. మంగళవారం (డిసెంబర్ 16) ప్రారంభమైన ఆక్షన్ లో నలుగురు భారత క్రికెటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్,  దీపక్ హుడా, శ్రీకర్ భరత్ అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న పృథ్వీ షా, సర్ఫరాజ్ లకు ఐపీఎల్ మినీ వేలంలో నిరాశే మిగిలింది. మంగళవారం (డిసెంబర్ 16) ప్రారంభమైన మినీ వేలంలో వీరిద్దరినీ కొనడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. రూ.75 లక్షల బేస్ ప్రెస్ తో వచ్చిన వీరిద్దరిని ఆశ్చర్యకరంగా ఒకరు కూడా కొనుగోలు చేయలేదు. 

షా కు గత ఐపీఎల్ లో నిరాశే మిగిలింది. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ ను గత ఏడాది జరిగిన మెగా ఆక్షన్ లో ఈ ఫ్రాంచైజీ కొనలేదు. టీమిండియా యువ క్రికెటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ లకు ఐపీఎల్ మినీ వేలంలో నిరాశే మిగిలింది. మంగళవారం (డిసెంబర్ 16) ప్రారంభమైన మినీ వేలంలో వీరిద్దరినీ కొనడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. రూ.75 లక్షల బేస్ ప్రెస్ తో వచ్చిన వీరిద్దరిని ఆశ్చర్యకరంగా ఒకరు కూడా కొనుగోలు చేయలేదు. షా కు గత ఐపీఎల్ లో నిరాశే మిగిలింది. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ ను గత ఏడాది జరిగిన మెగా ఆక్షన్ లో ఈ ఫ్రాంచైజీ కొనలేదు.    

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సర్ఫరాజ్ అద్భుతంగా రాణించాడు. ముంబై తరపున రెండు మెరుపు హాఫ్ సెంచరీలు చేయడంతో ఈ సారి ఖచ్చితంగా ఆక్షన్ లో ధర పలుకుతాడేమో అనుకున్నారు. ఆశ్చర్యకరంగా ఈ ముంబై క్రికెటర్ కు ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చారు. హర్యానాతో జరిగిన మ్యాచ్ లో సర్ఫరాజ్ 25 బంతుల్లోనే 64 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. మంగళవారం (డిసెంబర్ 16) రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 22 బంతుల్లోనే 73 పరుగులు చేసి ఆక్షన్ ముందు భారీ ధర ఖాయమనేలా చేశాడు. 

పృథ్వీ షా విషయానికి వస్తే ఎప్పటి నుంచో ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. దేశవాళీ క్రికెట్ లో అడపాదడపా మెరిసినా భారీ ఇన్నింగ్స్ లు ఆడడంలో విఫలమవుతున్నాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ షా ను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. వ్రీరితో పాటు రూ.75 లక్షలతో ఆక్షన్ లోకి వచ్చిన దీపక్ హుడా, శ్రీకర్ భరత్ లు కూడా అన్ సోల్డ్ గా మిగిలిపోయారు.