మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల ఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. లేటెస్ట్ గా ఆమె 'మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' అవార్డ్ ను సొంతం చేసుకుంది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది ఉపాసన . ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ప్రస్తుతం తాను ప్రెగ్నెన్సీతో ఉన్నందువల్ల ఈ పురస్కారాన్ని తీసుకునేందుకు వెళ్లలేకపో యానని ఉపాసన తెలిపింది. ఈ గుర్తింపు మరింత ఎక్కువగా పనిచేయడానికి, తమ పరిమితులను అధిగమించ దానికి ప్రేరణనిస్తుందని పేర్కొంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన మెగా అభిమానులు ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతున్నారు.
దీనికి తోడు రామ్చరణ్, ఉపాసన దంపతుల ఇంట త్వరలో మరోసారి శుభవార్త వినిపించనుంది. 2012లో వివాహం చేసుకున్న ఈ జంట, 2023 జూన్ లో క్లీంకారకు జన్మనిచ్చారు. తాజాగా, ఉపాసన రెండోసారి గర్భం దాల్చింది. దీపావళి సంబరాల్లో భాగంగా ఆమెకు సీమంతం నిర్వహించారు. అలాగే 'డబుల్' అనే సదాన్ని పదే పదే ఉపయోగించడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' మూవీలో నటిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్ గా.. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ స్పోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఎ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 27, 2026న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టైలర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.
