నాగ చైతన్య హీరోగా, చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తండేల్’ చిత్రం గద్దర్ అవార్డ్స్ 2025లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికయ్యింది. ఉత్తమ నటుడిగా నాగ చైతన్యకు అవార్డు లభించగా, బెస్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిల్మ్‌గా కూడా సత్తా చాటింది. రాజు అనే జాలరి పాత్రలో నాగ చైతన్య రా అండ్ రస్టిక్ లుక్‌లో తనదైన సహజ నటనతో మెప్పించాడు.
ఈ సందర్భంగా నాగ చైతన్యని ప్రభుత్వం గుర్తించి గద్దర్ అవార్డ్స్ తో గౌరవం ఇచ్చి సత్కరించనుంది. ఈ అవార్డు నాగ చైతన్య కెరీర్‌లో మరొక ప్రత్యేక ఘట్టం అని చెప్పవచ్చు. నటుడిగా, అలాగే సాంఘిక అంశాలపై సినిమా చూపిన ప్రభావంతో ఈ చిత్రం ముఖ్యమైన గుర్తింపును సాధించింది. అయితే, ఇదంతా తన భార్య రాక వల్లే సాధ్యమైందంటూ చై చెబుతూ ‘శోభితా లేడీ లక్’ అని తెలిపారు.
భార్యపై ప్రశంసలు, ‘లేడీ లక్’
అవార్డు గురించి మాట్లాడిన నాగ చైతన్య తన భార్య శోభితా ధూళిపాళను ప్రేరణ మరియు శక్తి మూలంగా పేర్కొన్నారు. “తండేల్ భారీ హిట్ కొట్టడం, వంద కోట్లు కలెక్షన్ చేయడం, ఇప్పుడు గద్దర్ అవార్డులో ఉత్తమ నటుడు అవార్డుకు ఎంపిక కావడం.. ఈ అద్భుత ఘట్టాలన్నీ శోభితా నా జీవితంలోకి రాగానే సాధించబడ్డాయి. ఆమె ఖచ్చితంగా నా లేడీ లక్.” అని చై భార్య శోభితాపై ప్రశంసలు కురిపించారు.
అలాగే, “మీ పునాది చాలా ముఖ్యమని నేను ఎప్పుడూ చెబుతుంటా. ఎందుకంటే ఇంట్లో ఉన్న బలం, శక్తి మీ వృత్తి జీవితంలోకి కూడా వస్తుంది. అవును, శోభిత ఖచ్చితంగా నా లేడీ లక్ గా మారింది” అని నాగ చైతన్య చెప్పడంతో న్యూస్ వైరల్ అవుతుంది.
‘తండేల్’ – ప్రత్యేక స్థానం
నాగ చైతన్య 2024లో శోభితతో వివాహం చేసుకున్న తర్వాత విడుదలైన ‘తండేల్’ తన కెరీర్‌లో మైలురాయి సినిమా గా నిలిచింది. సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి, ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. నిజానికి 2022లో థ్యాంక్యూ సినిమాతో చై ప్లాప్ ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత హిందీ మూవీ లాల్ సింగ్ చద్దా, 2023లో కస్టడీ వంటి సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్నాడు.
'THANDEL RAJU’ conquered hearts, earned accolades, and now receives the top honour ✨
— Geetha Arts (@GeethaArts) March 7, 2026
Yuvasamrat @chay_akkineni wins the BEST ACTOR award at the Gaddar Telangana Film Awards 2025 for his spectacular performance in #Thandel ❤️🔥#Dhullakottesadu#BlockbusterThandel… pic.twitter.com/0HSCiwPUEy
ఈ క్రమంలోనే 2024లో హీరోయిన్ శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకున్నాడు. ఆ వెంటనే 2025లో తండేల్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి... చై కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది. దీంతో శోభిత అతనికి 'లేడీ లక్'గా మారింది అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.
‘‘తండేల్’’ అవార్డు ప్రాధాన్యతను వివరిస్తూ..
“తండేల్ నాకు ప్రత్యేకమైన సినిమా. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన మత్స్యకారుల నిజ జీవిత కథ. వారి కష్టాలు, ధైర్యం, రోజువారీ జీవితం తెలుసుకోవడం కోసం వారి మధ్య గడిపిన సమయం ప్రేరణాత్మకంగా అనిపించింది. ఈ అనుభవం నాకు వ్యక్తిగతంగా కొత్త పాఠాలు నేర్పింది.” అని నాగచైతన్య తెలిపారు.
Truly elated for the Best Actor award at the Gaddar Telangana Film Awards 2025 for my very special film #Thandel. Also thrilled that Thandel won the Best National Integration Film.
— chaitanya akkineni (@chay_akkineni) March 9, 2026
My heartfelt thanks to the Telangana Government, Hon’ble CM @revanth_anumula garu, Deputy CM…
