కూకట్‌పల్లిలో కోటి రూపాయలు దోపిడి కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.10 నోటు చూపిస్తే కోటి రూపాయలు ఇచ్చారు !

కూకట్‌పల్లిలో కోటి రూపాయలు దోపిడి కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.10 నోటు చూపిస్తే కోటి రూపాయలు ఇచ్చారు !

హైదరాబాద్: కూకట్‌పల్లిలో కోటి రూపాయలు చోరీకి గురైన కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగుచూసింది. ఈ దోపిడీకి గురైన సొమ్మును హవాలా డబ్బుగా పోలీసులు గుర్తించారు. సినిమాటిక్ తరహాలో హవాలా డబ్బును చేతులు మార్చేందుకు ప్రయత్నించారు. రూ.10 నోటు చూపించి ఓ వ్యాపారి నుంచి ఇద్దరు ఏజెంట్లు కోటి రూపాయలు తీసుకున్నారు.

ఈ కోటి రూపాయల డబ్బును ఇవ్వాల్సిన పాయింట్లో ఇచ్చేందుకు ఏజెంట్లు వెళ్తుండగా వాళ్ల కళ్లలో కారం కొట్టి డబ్బును దుండగులు దోచుకెళ్లారు. కూకట్ పల్లి దోపిడీ కేసులో నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీ సొమ్ముతో నిందితులు లక్నో పారిపోతుండగా కూకట్ పల్లి పోలీసులు పట్టుకున్నారు.

కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో భారీ దోపిడి:
* మెట్రో పిల్లర్ నంబర్ 837 దగ్గర రాత్రి 9:40 గంటలకు ఘటన
* ఇద్దరు ఏసీ మెకానిక్లపై మిర్చి పొడి చల్లి దాడి చేసి దోపిడి
* కోటి నగదు ఉన్న గోల్డ్ డ్రాప్ కార్టన్ బాక్స్ దోపిడి చేసిన దుండగులు
* స్కూటీపై వెళ్తున్న ఇద్దరు ఏసీ మెకానిక్‌లు ఎం.డి. ఖుస్రూ, ఎం.డి. అజీముద్దీన్లను అడ్డగించిన దుండగులు
* రెండు బైక్లపై వచ్చిన నలుగురు దుండగులు 
* దోపిడి అనంతరం బైక్పై దుండగుల పరారీ
* ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన కూకట్ పల్లి పోలీసులు 
* నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు

పోలీసులకు ఫిర్యాదు చేసిన అజీముద్దీన్.. అజీముద్దీన్ పేర్కొన్న వివరాలు:
* నేను, కుష్రో.. అమీర్ దగ్గర పనిచేస్తాం
* నిన్న రాత్రి 7 గంటలకు నమాజ్ ముగించుకున్న తర్వాత  అమీర్ మాకు 10 రూపాయల నోటు ఇచ్చాడు
* ఈ నోటును కూకట్‌పల్లిలోని పవన్‌కు అందజేయమని సూచించాడు 
* పవన్‌కు నోటు ఇచ్చిన తర్వాత అతను ఇచ్చే హవాలా డబ్బులు తీసుకుని ఇబ్రహీంకు అందజేయాలని చెప్పాడు
* నేను, కుష్రోకు ఇద్దరం రాత్రి 8.15 కి  కూకట్‌పల్లి చేరుకున్నాక పవన్‌కి ఫోన్ చేశాం
* అతను పిల్లర్ నెం. 825 దగ్గర ఉన్న గోకుల్ ఎన్‌క్లేవ్కి రమ్మన్నాడు
* మేము 10 రూపాయల నోట్ చూపించగానే.. కార్టన్ పెట్టెలో 1 కోటి రూపాయల హవాలా నగదు ఇచ్చారు
* ఆ డబ్బు తీసుకుని ఇబ్రహీంకి కాల్ చేశాం.. పిల్లర్ నెంబర్ 848 దగ్గరకు రమ్మని చెప్పాడు
* కుష్రో బైక్ నడుపుతుండగా..  నేను డబ్బు ఉన్న బాక్స్లు పట్టుకుని వెనక కూర్చున్నాను
* పిల్లర్ నెం. 836 దగ్గరకు రాగానే రెండు బైకుల్లో వచ్చిన వ్యక్తులు మాపై కారం పొడి చల్లారు
* మేము కిందపడిపోయాం.. వెంటనే కత్తులు చూపించి బెదిరించి డబ్బు దోచుకెళ్లారు