అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం నడిచింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తాము కూడా పదేళ్లు పాలించి ప్రతిపక్షంలో ఉన్నామని కేటీఆర్ గుర్తుచేశారు.

రేవంత్ తొలి సంతకం చేసిన ఫైల్ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. కాకి ఎత్తుకుపోయిందా లేక FSL అగ్నిప్రమాదంలో కాలిపోయిందా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మాయమైపోయిన ఫైల్ కోసం సిట్ వేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏమైందని ప్రశ్నించారు.

కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భగ్గుమన్నారు. మీరు లక్షల కోట్ల అప్పు చేసిపోతే.. మేం వడ్డీలు కడుతున్నామని కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ధన్యవాదాలు చెప్పాలని కోమటిరెడ్డి అన్నారు.