తమిళ స్టార్ హీరో , టీవీకే అధినేత దళపతి విజయ్ వ్యక్తగతం జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు రాజకీయలు, మరోవైపు సినిమా వివాదంతో బిజీగా ఉన్న ఆయన.. ప్రస్తుతం తీవ్రమైన వ్యక్తిగత ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం విడాకులు కోసం కోర్టు మెట్టులు ఎక్కడం కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరో వైపు త్రిషలో సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలు తీవ్ర గందరగోళాన్ని గురిచేస్తుంది.
విడాకుల వివాదం..
చాలా కాలంగా విజయ్, సంగీత విడివిడిగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే విడాకుల కోసం ఇటీవల సంగీత కోర్టును ఆశ్రయించింది. విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి జిల్లా కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 20, 2026కి వాయిదా వేసింది. ఈ పరిణామం విజయ్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
త్రిషతో లింక్-అప్..
ఈ విడాకుల వార్తల మధ్య నటి త్రిష కృష్ణన్ పేరు తెరపైకి రావడం మరింత దుమారం రేపింది. విజయ్, త్రిష మధ్య ఏదో ఉందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి నటించిన 'లియో' సినిమా తర్వాత ఈ పుకార్లు ఊపందుకున్నాయి. విమానాశ్రయాల్లో, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పాపరాజీలు త్రిషను చుట్టుముట్టి ఈ విషయంపై ప్రశ్నలు అడుగుతుండటం, నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
త్రిషకు బాసటగా ఖుష్బూ
ఈ నేపథ్యంలో నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ త్రిషకు మద్దతుగా నిలిచారు. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ట్రోలర్లపై నిప్పులు చెరిగారు. త్రిష నాకు చాలా కాలంగా తెలుసు. ఆమె అత్యంత హుందాగా వ్యవహారించే మహిళల్లో ఒకరు. చాలా సున్నిత మనస్కురాలు అని ఖుష్బూ కొనియాడారు. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ మానసిక ఆనందం పొందుతారని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆమె ఘాటుగా విమర్శించారు. గతంలో ముంబైలో మాత్రమే కనిపించే ఈ పాపరాజీ సంస్కృతి ఇప్పుడు చెన్నైకి కూడా పాకిందని, సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నెటిజన్లలో 99 శాతం మంది ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడటం అలవాటని, అలాంటి వారి వ్యాఖ్యలకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదని ఖుష్బూ స్పష్టం చేశారు. విజయ్ - సంగీత విడాకుల కేసు ఏప్రిల్ 20న కోర్టులో విచారణకు రానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) పనుల్లో నిమగ్నమై ఉండగా, ఈ వ్యక్తిగత వివాదాలు ఆయన ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
