యాదాద్రి జిల్లాలో దారుణం.. స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి

యాదాద్రి జిల్లాలో దారుణం.. స్కూల్ బస్సు కింద పడి బాలుడు మృతి

స్కూల్ బస్సు కిందపడి రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లాలోని భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం (జూన్ 27) తన పెద్ద కుమారుడిని దింపేందుకు తల్లి స్కూల్ బస్సు దగ్గరికి వెళ్లింది. అన్న కోసం తల్లి వెనకే చిన్న కొడుకు కూడా వెళ్లాడు. 

ఈ క్రమంలో డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు వెళ్లడంతో టైరు కింద పడి బాలుడు మృతి చెందాడు. తలపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడిని రెండున్నరేళ్ల రియాన్స్ గా గుర్తించారు.