ఆప్ఘానిస్తాన్‎లో 6.2 తీవత్రతో భారీ భూకంపం.. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‎లో ప్రకంపనలు

ఆప్ఘానిస్తాన్‎లో 6.2 తీవత్రతో భారీ భూకంపం.. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‎లో ప్రకంపనలు

కాబుల్: వరుస భూకంపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. రెండు రోజుల క్రితం సంభవించిన రెండు వరుస భూకంపాలు వెనిజువెలాను అతలాకుతలం చేశాయి. రెండు రోజులు గడిచిన ఆ దేశంలో ఇంకా సహయక చర్యలు కొనసాగుతున్నాయంటే భూకంప ప్రభావం ఏ రేంజ్‏లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగానే.. తాజాగా ఆప్ఘానిస్థాన్‎లోని హిందూ కుష్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది.

 రిక్టర్ స్కేల్‎పై భూకంప తీవ్రత 6.2 తీవ్రత నమోదైంది. భారత కాలమానం ప్రకారం శనివారం (జూన్ 27) రాత్రి 7:04 గంటల ప్రాంతంలో భూమికి 215 కిలో మీటర్ల లోతులో భూకంపం చోటుచేసుకుంది. ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్‌లోని కలాఫ్‌గాన్‌కు సుమారు 81 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. 

ఈ భూకంప ప్రభావంతో పాకిస్తాన్, భారతదేశం, చైనా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్, తుర్క్‌మెనిస్తాన్‌లలో ప్రకంపనలు సంభవించాయి. భారత్ లోని ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‎లో స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు.