హైదరాబాద్ సిటీ, వెలుగు: అర్హులైన దళితులకు ఆర్థిక సాయం అందించేలా ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద వాహనాలను సబ్సిడీపై అందించనున్నారు. దీనికి సంబంధించిన 2025–26 ప్లాన్ను హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి సోమవారం విడుదల చేశారు. ఈ పథకాల్లో భాగంగా బ్యాంకు అనుసంధానంతో రూ.లక్ష విలువ చేసే టూ వీలర్ కు 90 శాతం సబ్సిడీ, త్రీ వీలర్(ఎలక్ట్రికల్ ఆటో/ గూడ్స్)కు 70 శాతం సబ్సిడీ ఉంటుందని తెలిపారు.
జిల్లాలోని అన్ని మండలాల నుంచి 21 నుంచి 50 ఏండ్లున్న ఎస్సీలు మార్చి 17 నుంచి 24 వరకు tgobmms.cgg.gov.in లేదా మీసేవ సెంటర్ల ద్వారా అప్లై చేసుకోవచ్చన్నారు. వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదన్నారు. ఈవీ టూ వీలర్లు 270, ఈవీ త్రీ వీలర్లు 153 అందించనున్నట్లు పేర్కొన్నారు.
