ఇండియాలో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో కస్టమర్ల కోసం హ్యాపీ న్యూ ఇయర్ 2026 పేరుతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్‌ల ధరలు రూ.103, రూ.500 & రూ.3,599. ఈ ప్లాన్స్ అన్నింటిలోనూ ఫ్రీ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, అలాగే చాలా మంచి ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌లు MyJio యాప్, జియో వెబ్‌సైట్, రిటైల్ షాపుల్లో లభిస్తాయి.
జియో హ్యాపీ న్యూ ఇయర్ 2026: హీరో అన్యువల్ ప్లాన్ ధర రూ.3,599
ఈ ప్లాన్ వ్యాలిడిటీ పూర్తిగా 365 రోజులు అంటే ఒక ఏడాది మొత్తం. ఈ ప్లాన్ ప్రయోజనాలు చూస్తే ఆన్ లిమిటెడ్ 5G డేటా, రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు చేసుకోవచ్చు. బోనస్ గా 18 నెలల పాటు Google Gemini Pro ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తుంది.
సూపర్ సెలబ్రేషన్ ప్లాన్ : దీని ధర రూ.500, ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అలాగే ఈ ప్లాన్ ప్రయోజనాలు చూస్తే ఆన్ మిటెడ్ 5G డేటా, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా. ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇంకా రోజుకు 100 SMSలు పంపొచ్చు.
Also read:- ఇన్వెస్టర్ల సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..
OTT ప్లాట్‌ఫామ్స్: నెలకు రూ.500 విలువైన OTT ప్లాట్‌ఫామ్స్ యాక్సెస్ లభిస్తుంది. ఇందులో YouTube ప్రీమియం, JioHotstar, Amazon Prime వీడియో మొబైల్ ఎడిషన్, Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, Sun NXT, Kancha Lannka, Planet Marathi, Chaupal, FanCode, Hoichoi వంటివి ఉన్నాయి. బోనస్ కింద 18 నెలల పాటు Google Gemini Pro ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తుంది.
ఫ్లెక్సీ ప్యాక్ యాడ్-ఆన్: ఈ ప్లాన్ ధర రూ.103, వ్యాలిడిటీ వచ్చేసి 28 రోజులు, మొత్తం డేటా 5GB. విషయం ఏంటంటే ఇది ఒక 'యాడ్-ఆన్' ప్యాక్. అంటే మీ ప్రస్తుత ప్లాన్‌కు అదనంగా దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఎంటర్టైన్మెంట్ ప్యాక్ కింద హిందీ ప్యాక్: JioHotstar, ZEE5, Sony LIV...... ఇంటర్నేషనల్ ప్యాక్: JioHotstar, FanCode, Lionsgate Play, Discovery+....... రీజినల్ ప్యాక్: JioHotstar, Sun NXT, Kancha Lannka, Hoichoi. ఇందులో మీరు నచ్చిన ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
