ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వీవో నుంచి బడ్జెట్ స్మార్ట్ఫోన్ఇండియాలో రిలీజ్ అయింది. Vivo భారత మార్కెట్లో భారీ 7200mAh బ్యాటరీతో కూడిన కొత్త T5x 5Gని విడుదల చేసింది. ఫోన్‌ను ఎక్కువగా వాడేవారికి ఇది అనువైనది. ప్రతిరోజూ తమ హ్యాండ్‌సెట్‌ను ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ డివైజ్ లో ఉంది. 120Hz డిస్‌ప్లే, ఆకర్షణీయమైన డిజైన్‌తో అందరిని ఆకట్టుకుంటోంది.
బ్యాటరీ :
T5x 5G ఫీచర్లలో భారీ బ్యాటరీ లైఫ్ కూడా ఉంది. 7200mAh సామర్థ్యంతో గేమింగ్, స్ట్రీమింగ్ లేదా స్మార్ట్‌ఫోన్‌లోనే ఎక్కువ టైం గడిపినా కూడా ఈ డివైజ్ రోజంతా ,అంతకంటే ఎక్కువ సేపు పనిచేస్తుంది. ఈ పరికరం 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఉంటుంది.
డిస్ ప్లే..
ఈ స్మార్ట్ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో6.78 ఇంచెస్LCD తో లభిస్తోంది. ఈ డివైజ్ లో మరో ప్రత్యేకత స్మూత్ స్క్రోలింగ్ కు సపోర్టు చేస్తుంది. 1200 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ ను కలిగి ఉంటుంది. వెలుతురులో కూడా చక్కగా కనిపిస్తుంది. సూర్యరశ్మీ తో మీ స్క్రీన్ ప్రభావితం కాదు.
దీనిలో డైమెన్సిటీ 7400 అల్ట్రా చిప్‌సెట్ ఉంటుంది. ఇది రోజువారీ పనులు,తేలికపాటి గేమింగ్ కోసం అనువైనది. ఈ స్మార్ట్ ఫోన్ లో వేగవంతమైన నెట్‌వర్క్ స్పీడ్ కోసం డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్ కూడా ఉంది.
ఫొటోగ్రఫీ: ఈ డివైజ్ లో బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ఫ్రంట్ లో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది అద్బుతమైన వీడియాకాల్స్, ఇన్ స్టాగ్రామ్కోసం అద్బుతమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
సాఫ్ట్ వేర్, ఆపరేటింగ్ సిస్టమ్..
ఈ డివైజ్ లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒరిజినల్ Os ఉంటుంది. 256GB వరకు స్టోరేజ్ ఉంటుంది. మైక్రో SD కార్డుతో మరింత పెంచుకోవచ్చు. అంతేకాకుండా IP69, IP69డస్ట్ , వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది.
►ALSO READ | మార్కెట్ల మాస్ రికవరీ: పాతాళం నుంచి లాభాల్లోకి.. కారణం ఏంటంటే..?
మొత్తం మీద బ్యాటరీ, డిస్‌ప్లే, పనితీరు విషయంలో రాజీ పడకుండా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే కొత్త T5x 5G ఒక మంచి ఎంపిక అవుతుంది.
ధర, వేరియంట్లు..
ఈ డివైజ్ సైబర్ గ్రీన్,స్టార్ సిల్వర్ రంగుల్లో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు విభిన్న స్టోరేజీలలో అందుబాటులో ఉంది.
- 6GB RAM,128GB స్టోరేజ్, ధర రూ. 18వేల999లు
- 8GB RAM ,128GB స్టోరేజ్, ధర రూ. 20వేల999లు
- 8GB RAM ,256GB స్టోరేజ్, ధర రూ. 22వేల999 లు
లభ్యత :
ఈ ఫోన్ మార్చి 24వ తేదీ మధ్యాహ్నం నుంచి అమ్మకానికి వస్తుంది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ అమెజాన్ స్టోర్‌లో లభిస్తుంది. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి అదనంగా రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.
