అసభ్యకర కామెంట్స్ చేస్తే కఠిన చర్యలు..సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక.

అసభ్యకర కామెంట్స్ చేస్తే కఠిన చర్యలు..సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక.

సోషల్ మీడియా ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చిన ఈ వేదిక ఇప్పుడు కొందరు ఆకతాయిల చేతిలో అస్త్రంగా మారుతోంది. ఇన్ స్టా గ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్ వేదికగా మహిళలను వేధింపులకు గురి చేస్తున్న ఘటనలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు

సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరినీ వదలకుండా అసభ్యకరమైన పదజాలంతో కామెంట్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న కేటుగాళ్లపై సైబరాబాద్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెర వెనుక ఉండి గుట్టుచప్పుడు కాకుండా తప్పుడు కామెంట్స్ చేసే వారిని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తున్నామని ఆయన వెల్లడించారు. వేధింపులకు పాల్పడుతున్న వారిలో మైనర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. అలాంటి వారికి సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పారు.

మైనర్ల విషయంలో కేవలం పిల్లలకే కాకుండా, వారి తల్లిదండ్రులను సైతం పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారో గమనించాలని సూచించారు.  ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చినా మారకుండా, పదే పదే తప్పుడు కామెంట్స్ పోస్ట్ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.