హైదరాబాద్ గచ్చిబౌలిలోని SATS షూటింగ్ రేంజ్‌లో తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు.
ఒకవైపు సుదీర్ఘ కాలం పాటు ప్రజా సేవలో, శాంతిభద్రతల పరిరక్షణలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వర్తించిన అంజనీ కుమార్.. క్రీడారంగంలోనూ తనకున్న అపారమైన ప్రతిభను, పట్టుదలను మరోసారి చాటిచెప్పారు. యువ క్రీడాకారులకు దీటుగా, పూర్తి ఏకాగ్రతతో పిస్టల్ పట్టి.. గురి తప్పకుండా పాయింట్లు సాధించి, స్వర్ణ పతకంతో మెరిశారు. షూటింగ్ క్రీడపై ఆయనకున్న మక్కువ, నైపుణ్యం ఎంతటిదో ఈ విజయంతో మరోసారి స్పష్టమైంది.
కీలకమైన బాధ్యతల్లో ఉంటూనే.. క్రీడలను కెరీర్‌లో ఒక భాగంగా మార్చుకుని, ఈ వయసులోనూ స్టేట్ లెవెల్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకం. మాజీ డీజీపీ అంజనీ కుమార్ సాధించిన ఈ ఘన విజయంపై షూటింగ్ వర్గాలు, క్రీడా ప్రముఖులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ.. ఆయనకు పెద్ద ఎత్తున విషెస్ చెబుతున్నారు.
