60 కి.మీ ఛేజింగ్.. 2 గంటల హైడ్రామా.. హిట్ అండ్ రన్ కేసులో ట్రక్కుతో బీభత్సం..దాదాదపు రెండు గంటల పాటు పోలీసులకు చుక్కలు చూపించాడు ఓ డ్రైవర్. 60 కిలోమీటర్ల పోలీసులను ఉరికించాడు. పోలీస్ బారీ కేడ్లను గుద్దుకుంటూ హైస్పీడ్ లో ట్రక్కును రన్ చేశాడు. అడ్డొచ్చిన పోలీసులు, స్థానికులపైకి దూసుకెళ్లాడు.. చివరికి పోలీసులు చేతికి చిక్కి కటకటాల పాలయిన ఘటన చత్తీస్ గఢ్ లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఛత్తీస్ గడ్ లోని రాజ్‌నంద్‌గావ్-మాన్‌పూర్ రహదారిపై అంబాగఢ్ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండర్‌దేహి గ్రామంలో ఈ ఘటన జరిగింది. దాదాపు రెండు గంటల పాటు ఛేజింగ్ చేసి పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.. ఈ చేజింగ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహారాష్ట్ర సరిహద్దుకు కొద్దిదూరంలో ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లతో ఈ చేజింగ్ ముగిసింది.
CHHATTISGARH! 🚨📍
— AVM (@AvmNews7) June 26, 2026
A speeding truck brutally crushed an innocent child to death in Gunderdehi village (Mohla Manpur).💔
Instead of stopping, the ruthless driver smashed through multiple police barricades and fled towards Maharashtra. pic.twitter.com/GHuGcIbB4i
"rok rok rok kahne se rukega wo" ?
— Ria 🥀 (@miss_riya999) June 27, 2026
> A speeding truck allegedly struck and killed an 11-year-old girl in Chhattisgarh before the driver attempted to flee the scene, triggering a dramatic police chase spanning nearly 60 km.
> Authorities said the truck rammed through multiple… pic.twitter.com/NJ30DUy83v
అసలు విషయం ఏంటంటే..
గుండర్‌దేహి గ్రామానికి చెందిన 11ఏళ్ల పూనమ్ అనే బాలికు ట్రక్ ఢీకొట్టడంతో స్పాట్ లోనే చనిపోయింది.. అయితే డ్రైవర్ ట్రక్కు ను ఆపకుండా హైస్పీడ్ తో మోహ్లా అనే పట్టణం వైపు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు..వాహనాన్ని అడ్డగించేందుకు మోహ్లా పోలీస్ స్టేషన్ బయట బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, డ్రైవర్ పోలీసులను లెక్కచేయకుండా, స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన మరో ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టి, బారికేడ్లను ఛేదించుకుని వేగంగా బండి నడుపుతూ పారిపోయాడు. వెంటనే సమీపంలోని మాన్ పూర్ అనే టౌన్ దగ్గర చెక్ పాయింట్ ఏర్పాటు చేశారు. అయినా డ్రైవర్ మళ్లీ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. బారీకేడ్లను కొంత దూరం ఈడ్చుకెళ్లి వాహనాన్ని వేగంగా నడుపుతూ తప్పించుకున్నాడు. ట్రక్కును వెంబడిస్తున్న టైంలో పోలీసులను కూడా ఢీకొట్టేందుకు వెనకాడలేదు డ్రైవర్..అయితే అప్రమత్తమైన పోలీసులు తృటిలో తప్పించుకున్నారు .
ఛేజింగ్ ముగిసిందిలా..
60 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మహారాష్ట్ర సరిహద్దుల్లో ఈ ఛేజింగ్ఎట్టకేలకు ముగిసింది. ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో, పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌కు గాయాలయ్యాయి, చికిత్స కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం పరీక్ష అనంతరం పూనమ్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, ట్రక్కును సీజ్ చేశారు.
