- సీపీ సజ్జనార్ ప్రకటన
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ కేసుల్లో జప్తు చేసిన, రోడ్లపై వదిలేసిన 2,193 వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించినట్లు సీపీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు.
వాహనాలపై ఎలాంటి అభ్యంతరాలున్నా, యాజమాన్య హక్కులు, ఫైనాన్స్/హైపోథికేషన్ క్లెయిమ్‌లు ఉన్నవారు ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 6 నెలల వ్యవధిలో బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ భవనంలో దరఖాస్తు సమర్పించి, తమ వాహనాలను క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు.
గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. వేలానికి సిద్ధంగా ఉన్న వాహనాల పూర్తి వివరాలను అంబర్‌పేట్ ఎస్ఏఆర్ సీపీఎల్పోలీస్ గ్రౌండ్స్‌లోని యాక్షన్ టీమ్ వద్ద లేదా అధికారిక వెబ్‌సైట్ www.hyderabadpolice.gov.in లో పరిశీలించవచ్చని పేర్కొన్నారు.
