నిహార్ ఇన్ఫో లిమిటెడ్ ఆదాయం రూ.35 కోట్లు

నిహార్ ఇన్ఫో లిమిటెడ్ ఆదాయం రూ.35 కోట్లు

హైదరాబాద్, వెలుగు: ఈ–కామర్స్​సేవలు అందించే హైదరాబాద్​కంపెనీ నిహార్ ఇన్ఫో గ్లోబల్ జూన్​ క్వార్టర్లో కార్యకలాపాల ద్వారా రూ.35.13 కోట్ల ఆదాయాన్ని సాధించింది.  నికర లాభం రూ.49 వేలుగా నమోదైంది. డిజిటల్ టెక్నాలజీ రంగానికి చెందిన ఈ సంస్థ తన గోల్డ్ అండ్ సిల్వర్ షాప్ ను అత్యంత సమగ్రమైన విలువైన లోహాల ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.  జెరోదా భాగస్వామ్యంతో భారతీయ గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ సేవలను అందుబాటులోకి తెస్తోంది.

 అంతర్జాతీయ ఈటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం గిఫ్ట్ సిటీలోని ఎన్​ఎస్​ఈ ఐఎక్స్ తో కూడా వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంది. కస్టమర్ల సౌలభ్యం కోసం గోల్డ్ లోన్లు, బైబ్యాక్ సేవలను డిజిటల్ పద్ధతిలో అందించనుంది. ఏఐ టెక్నాలజీతో మార్కెట్ ట్రెండ్స్, కస్టమర్ సేవలను మెరుగుపరచాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది.