ఏఐజీఎన్ఎఫ్‌‌‌‌కు అనుబంధ సంస్థగా తెలంగాణ నర్సుల అసోసియేషన్

ఏఐజీఎన్ఎఫ్‌‌‌‌కు అనుబంధ సంస్థగా  తెలంగాణ నర్సుల అసోసియేషన్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నర్సస్ అసోసియేషన్ (టీఎన్ఏ)కు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఆలిండియా గవర్నమెంట్ నర్సెస్ ఫెడరేషన్ (ఏఐజీఎన్ఎఫ్) –2026 సంవత్సరానికి టీఎన్ఏకు అధికారిక అనుబంధ గుర్తింపు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో 358 ప్రకారం ఏకీకృత సంఘంగా సేవలందించిన టీఎన్ఏ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత స్వతంత్రంగా నర్సుల సమస్యలపై పోరాడుతోంది. 

ప్రస్తుతం దక్కిన జాతీయ గుర్తింపుతో రాష్ట్ర నర్సింగ్ సిబ్బంది సమస్యలను దేశ స్థాయిలో ప్రస్తావించే అవకాశం లభించిందని, తమకు సహకరించిన ఏఐజీఎన్ఎఫ్ అధ్యక్షురాలు అనితా పన్వార్, సెక్రటరీ జనరల్ ఖురానాకు టీఎన్ఏ కృతజ్ఞతలు తెలిపింది. ఇకపై కూడా ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుత మార్గంలో ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ నర్సింగ్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని అసోసియేషన్ స్పష్టం చేసింది.