- సోమాజీగూడ గ్లామరస్ ఫ్యామిలీ సెలూన్ లో ఏడాదిగా నిర్వహణ
పంజాగుట్ట, వెలుగు: సోమాజిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో స్పా ముసుగులో ఏడాదిగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార దందాను పంజాగుట్ట పోలీసులు బయటపెట్టారు. పక్కా సమాచారంతో ఈ నెల 12న సాయంత్రం సదరు అపార్ట్మెంట్లోని గ్లామరస్ ఫ్యామిలీ సెలూన్ పై ఆకస్మికంగా దాడి చేసి, నిర్వాహకుడు ఎండీ.ఆఫ్తాబ్‌తో పాటు ఇద్దరు విటులను అరెస్ట్‌చేశారు. నలుగురు బాధితులను(మహిళలను) రక్షించారు.
నిర్వాహకుడు కస్టమర్ల వద్ద నుంచి రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో భవన యజమాని మోహన్‌కు కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆఫ్తాబ్వద్ద నుంచి రూ.4 వేలు, నాలుగు మొబైల్ ఫోన్లు, కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు లేవని, కస్టమర్ల రికార్డులు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. కాగా, మోహన్పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు,
