ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదులే దిక్కు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదులే దిక్కు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

రఘునాథపల్లి, వెలుగు: ఉమ్మడి వరంగల్​జిల్లాకు దేవాదుల ప్రాజెక్టే ఆధారమని స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఘనపూర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం రఘునాథపాలెం మండలం అశ్వరావుపల్లి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సాగునీటిని విడుదల చేశారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లోని నీటి నిల్వలను పరిశీలించారు. పంట కాలువల ద్వారా రాష్ట్రంలో ప్రస్తుతం ఏ ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయడం లేదని, దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా మాత్రమే సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. నెల రోజులుగా దేవాదుల పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపడం వల్లే ప్రస్తుతం పంటలకు నీరు విడుదల చేయగలుగుతున్నామని చెప్పారు.