గ్రేటర్ వరంగల్: మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తాం : కలెక్టర్‌‌ డాక్టర్‌‌ సత్యశారద

గ్రేటర్ వరంగల్: మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తాం : కలెక్టర్‌‌ డాక్టర్‌‌ సత్యశారద

గ్రేటర్​ వరంగల్, వెలుగు: రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్‌‌ మార్కెట్‌‌ ఏర్పాటుకు ప్రతిపాదించిన గీసుకొండ మండలం విశ్వనాథపురం స్థలాన్ని ఆదివారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి, కలెక్టర్‌‌ డాక్టర్‌‌ సత్యశారద, మార్కెట్‌‌ కమిటీ చైర్‌‌పర్సన్‌‌ పులి ప్రియాంక పరిశీలించారు. 

రైతులకు మెరుగైన మార్కెటింగ్‌‌ సౌకర్యాలు, పండ్ల విక్రయాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. స్థల విస్తీర్ణం, రహదారి, రవాణా, మౌలిక వసతులను పరిశీలించి భవిష్యత్‌‌ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని అధికారులను సూచించారు. అనంతరం ఎంజీఎంలో నిర్వహించిన ‘నశా ముక్త్​ యువ – వికసిత్​ భారత్’ 100 వారాల అభియాన్​లో భాగంగా నిర్వహించిన ఆరోగ్య, అవగాహన కార్యక్రమాల్లో కలెక్టర్​ పాల్గొని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం వాల్‌‌ పోస్టర్‌‌ను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌‌వో రాజిరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్‌‌ రామ్‌‌కుమార్‌‌రెడ్డి, డాక్టర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.