జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో షార్ట్ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌తో పేలిన సిలిండర్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో షార్ట్ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌తో పేలిన సిలిండర్లు

మహాముత్తారం, వెలుగు: కరెంట్‌‌‌‌‌‌‌‌ షార్ట్ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌తో మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం ములుగుపల్లి గ్రామంలో గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన  మండపు లచ్చిమల్లు, అతని ఇద్దరు కొడుకులు మోహన్, ప్రభాకర్ ఒకే ఇంట్లో మూడు గదుల్లో నివాసముంటున్నారు. గురువారం ఇంటికి తాళాలు వేసి పొలం పనులకు వెళ్లారు. లచ్చిమల్లు ఇంట్లో షార్టు సర్క్యుట్‌‌‌‌‌‌‌‌తో మంటలు చెలరేగి, ఇంట్లోని సామగ్రికి అంటుకున్నాయి. 

ఈక్రమంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఎగిసిపడి మిగతా రూమ్‌‌‌‌‌‌‌‌లకు అంటుకున్నాయి. దీంతో ఆ గదుల్లోని సిలిండర్లు సైతం పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. కాగా ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లోని నిత్యావసర వస్తువులతో పాటు నగదు, బంగారు, వెండి ఆభరణాలు కాలిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. స్థానికులు ఫైర్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు సమాచారమివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.