ములుగు, వెలుగు: ములుగు జిల్లా ములుగు మండలం సారంగపల్లిలో బంజారా సమాజం నిర్వహించిన తీజ్ వేడుకలకు మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మతానికి, ప్రతి కులానికి, ప్రతి సామాజిక వర్గానికి ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు ఉంటాయని అన్నారు. బంజారా సంస్కృతిలో తీజ్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు.
