ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‎లో పొగలు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు

ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‎లో పొగలు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు

అమరావతి: ఏపీ సంపర్క్ క్రాంత్రి ఎక్స్‎ప్రెస్ ట్రైన్‎కు పెను ప్రమాదం తప్పింది. S1 బోగీలో బ్రేక్ షూ దగ్గర ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. శుక్రవారం (ఆగస్ట్ 14) రైలు తిరుపతి నుంచి ఢిల్లీ వెళ్తుండగా మామండూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోగీలో పొగలను గమనించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే స్పందించిన రైల్వే సిబ్బంది ట్రైన్ నిలిపి మరమ్మత్తులు చేపట్టారు.

 ఒక్కసారిగా ట్రైన్ లో పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళకు గురయ్యారు. అయితే, ప్రయాణికులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. బోగీల పొగల వ్యాప్తికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.