హైదరాబాద్, వెలుగు: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అర్హులైన పౌరుల ఓట్లను అక్రమంగా తొలగించడం ప్రజాస్వామ్యానికే పెను ముప్పుగా పరిణమించిందన్నారు.
జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీ పదవి నుంచి తొలగించాలని, సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అఖిల పక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లోని చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించనున్నట్టు తెలిపారు. అదే విధంగా అక్టోబర్1న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు కార్యక్రమాలు ఉంటాయన్నారు.
