హీరోయిన్ మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 2026 సెప్టెంబర్ 28 (సోమవారం) తిరుమల సుప్రభాత సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానికి వచ్చిన నటి మీనాక్షి చౌదరిని ఆలయ సిబ్బంది ఆహ్వానించారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందచేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వచ్చిన మీనాక్షి చౌదరిని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.
