అర్ధరాత్రి డీజే హంగామాపై అల్లు శిరీష్ ఫిర్యాదు

అర్ధరాత్రి డీజే హంగామాపై అల్లు శిరీష్ ఫిర్యాదు

జూబ్లీహిల్స్, వెలుగు: పండగల సందడి పేరుతో అర్ధరాత్రి వరకు భారీ శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేయడంపై సినీ నటుడు అల్లు శిరీష్ అసహనం వ్యక్తం చేశారు. తన నివాసం సమీపంలోని వినోభానగర్ హనుమాన్ ఆలయం వద్ద అర్ధరాత్రి వరకు పెద్ద శబ్దాలతో సంగీతం వినిపిస్తోందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 

షేక్‌‌‌‌‌‌‌‌‌‌పేటలోని అపర్ణా వన్ అపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో  నివసిస్తున్నట్లు పేర్కొన్న అల్లు శిరీష్.. రాత్రి వేళల్లో డీజే సౌండ్స్​తో వృద్ధులు, చిన్నారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ శబ్దాలు వస్తున్నాయని ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. దీనిపై గతంలోనే ఫిల్మ్‌‌‌‌నగర్ పోలీస్ స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే గణేశ్ నిమజ్జనం పూర్తయిన తర్వాత కూడా శబ్దాలు వస్తున్నాయని తెలిపారు.