యువతే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శక్తి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

యువతే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శక్తి : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌కు యువతే అసలైన శక్తి అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. యూత్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసిన ఎంతో మంది నేతలు గతంలో పలు రాష్ట్రాలకు సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా పని చేశారని ఆయన గుర్తుచేశారు. సోమవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముఖ్య అతిథిగా హాజరైన మహేశ్ గౌడ్ యువజన నేతలను ఉద్దేశించి మాట్లాడారు. 

యూత్ కాంగ్రెస్ నేతలు నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రభుత్వానికి -ప్రజలకు మధ్య వారధిలా నిలవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలకు తగిన ప్రాధాన్యత కల్పించామని, రాబోయే రోజుల్లో పార్టీ పదవులతో పాటు అధికారిక పదవుల్లోనూ యువతకు సముచిత స్థానం ఇస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో జాతీయ యువజన కాంగ్రెస్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ మణి శర్మ, రాష్ట్ర ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్ సయ్యద్ ఖాలీద్, సహా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జులు భవ్య, రోహిణి జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.