హైదరాబాద్, వెలుగు: పోక్సో కేసులో దర్యాప్తు పూర్తై చార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన నిందితుడికి బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో బాధితురాలిని నిందితుడు ప్రభావితం చేసే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.
నిందితుడిపై ఆరోపణలు ఉన్నందున బెయిల్ మంజూరు చేయలేమని తెలిపింది. పోక్సో కేసులో గత జూన్ 9న అరెస్టయిన ఎండీ గౌస్ బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్. మధుసూదనరావు బెయిల్ పిటిషన్‌ను ఇటీవల కొట్టివేశారు.
