టీజీ సేఫ్‌‌‌‌ డ్రగ్స్ వింగ్ డైరెక్టర్‌‌‌‌ గా జి. రాంధాన్

టీజీ సేఫ్‌‌‌‌ డ్రగ్స్ వింగ్ డైరెక్టర్‌‌‌‌ గా జి. రాంధాన్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ సేఫ్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్ ) డ్రగ్స్ వింగ్ డైరెక్టర్‌‌‌‌ గా జి. రాంధాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ జాయింట్ డైరెక్టర్‌‌‌‌ గా సేవలందించిన ఆయనకు ప్రభుత్వం ప్రమోషన్ కల్పిస్తూ డైరెక్టర్‌‌‌‌ గా నియమించింది. ఈ మేరకు జి. రాంధాన్ డైరెక్టర్‌‌‌‌ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డ్రగ్స్ వింగ్ డైరెక్టర్ పోస్టు అందుబాటులో లేకుండా పోయింది.

 డ్రగ్ కంట్రోల్, పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ డైరెక్టర్ పోస్టును పునరుద్ధరించింది. ప్రభుత్వం ఈ పోస్టును పునరుద్ధరించిన తర్వాత టీజీ సేఫ్ డ్రగ్స్ వింగ్ డైరెక్టర్‌‌‌‌ గా నియమితులైన మొట్టమొదటి అధికారిగా జి. రాంధాన్ నిలిచారు.