సైబర్‌‌‌‌ అవగాహనకు నైట్‌‌‌‌ వాక్‌‌‌‌..‘హైదరాబాద్‌‌‌‌ హిట్స్‌‌‌‌ పాజ్‌‌‌‌’ పేరుతో నిర్వహణ

సైబర్‌‌‌‌ అవగాహనకు నైట్‌‌‌‌ వాక్‌‌‌‌..‘హైదరాబాద్‌‌‌‌ హిట్స్‌‌‌‌ పాజ్‌‌‌‌’ పేరుతో నిర్వహణ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సైబర్‌‌‌‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ సైబర్‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌‌‌‌బీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘హైదరాబాద్‌‌‌‌ హిట్స్‌‌‌‌ పాజ్‌‌‌‌’ పేరుతో అక్టోబర్‌‌‌‌ 1న నెక్లెస్‌‌‌‌ రోడ్‌‌‌‌లో నైట్‌‌‌‌ వాక్‌‌‌‌ నిర్వహించనుంది. పీపుల్స్‌‌‌‌ ప్లాజా వద్ద సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వాక్‌‌‌‌ 2 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. పాల్గొనేవారు సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ ఫ్లాష్‌‌‌‌లైట్లు వెలిగిస్తూ సైబర్‌‌‌‌ భద్రతపై అవగాహన కల్పించనున్నారు.

 ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే సైబర్‌‌‌‌ సెక్యూరిటీ అవేర్‌‌‌‌నెస్‌‌‌‌ కార్యక్రమాల్లో భాగంగా అక్టోబర్‌‌‌‌ 1 నుంచి 31 వరకు రాష్ట్రంలో నెల రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీజీసీఎస్‌‌‌‌బీ డైరెక్టర్‌‌‌‌ శిఖా గోయల్‌‌‌‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌‌‌‌ లైన్‌‌‌‌ మోసాలు, సైబర్‌‌‌‌ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడమే కార్యక్రమాల ఉద్దేశమన్నారు. నైట్‌‌‌‌ వాక్‌‌‌‌లో పాల్గొనాలనుకునేవారు టీజీసీఎస్‌‌‌‌బీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో రిజిస్ట్రేషన్‌‌‌‌ చేసుకోవాలని సూచించారు.