దానం నాగేందర్ అనర్హతతో.. ఖైరతాబాద్ స్థానం ఖాళీ ..గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి

  దానం నాగేందర్ అనర్హతతో.. ఖైరతాబాద్ స్థానం ఖాళీ ..గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి
  • కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం
  • యూపీ పోల్స్‌‌‌‌తోపాటు బైఎలక్షన్ జరిగే చాన్స్

హైదరాబాద్, వెలుగు:  ఎమ్మెల్యేగా దానం నాగేందర్ అనర్హుడంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో.. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు రాష్ట్ర శాసన సభ కార్యదర్శి రేండ్ల తిరుపతి సోమవారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 18న రాష్ట్ర హైకోర్టు పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌ను అనర్హుడని ప్రకటిస్తూ తీర్పు ఇవ్వడంతో దాని ఆధారంగా 10 షెడ్యూల్ లోని రెడ్ విత్ ఆర్టికల్ 191 (2) పేరాగ్రాఫ్ 2(1) ఏ కింద ఈ సీటును ఖాళీ అయినట్లు చూపిస్తూ గెజిట్ విడుదలైంది. 

2024 ఏప్రిల్ 23 నుంచి ఆయనపై అనర్హత అమల్లోకి వస్తుందని ఆ గెజిట్‌‌‌‌లో కార్యదర్శి పేర్కొన్నారు. ఈ గెజిట్ కాపీని సమాచారం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి అసెంబ్లీ కార్యదర్శి తిరుపతి పంపించారు. దీంతో దానం నాగేందర్  మాజీ ఎమ్మెల్యేగా మారిపోయారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మదిరిగే ఫలితాలు: దానం

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మదిరిగే ఫలితాలు వస్తాయని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ జోస్యం చెప్పారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ చేపట్టిన నిరసన ర్యాలీ సందర్భంగా నెక్లెస్‌‌‌‌రోడ్డులో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్ ప్రక్రియ ప్రభావం ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఉండదని తెలిపారు. ఎలక్షన్ కమిషన్‌‌‌‌ను అడ్డంపెట్టుకొని బీజేపీ ఓట్ చోరీకి పాల్ప డిందని ఆరోపించారు. 

సికింద్రాబాద్ పార్ల మెంట్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓటు చోరీతోనే గెలిచారని,  ఆయన అక్కడ తనపై గెలిచే అవకాశమే లేదని పేర్కొన్నా రు. ఓట్ చోరీకి బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆయన రాజీనామా చేయని పక్షంలో సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని ఆయన్ను తొలగించాలని కోరారు