అక్టోబర్ 11 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

అక్టోబర్ 11 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. వచ్చేనెల 11 నుంచి 17 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు టాస్ డైరెక్టర్ కే.లింగయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌‌‌‌సైట్ www.telanganaopenschool.org నుంచి డౌన్‌‌‌‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. 

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్‌‌‌‌తో పాటు తప్పనిసరిగా ఆధార్ గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రానికి తీసుకురావాలని  ఆదేశించారు. అభ్యర్థులు రెండు రోజుల ముందే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని ఒకసారి సందర్శించి నిర్ధారించుకోవాలని అభ్యర్థులకు స్పష్టం చేశారు.