డీజిల్ కొనుగోళ్లపై ఆంక్షలు..200 లీటర్లకు మించి కొట్టరంట..!  

డీజిల్ కొనుగోళ్లపై ఆంక్షలు..200 లీటర్లకు మించి కొట్టరంట..!  
  • నయారా బంకుల్లో గరిష్టంగా 200 లీటర్లు

న్యూఢిల్లీ: సరఫరాపై ఒత్తిడి పెరగడంతో జియో–-బీపీ, నయారా ఎనర్జీ సంస్థలు డీజిల్ అమ్మకాలకు పరిమితులు విధించాయి.  జియో–-బీపీ బంకుల్లో ఒక కస్టమర్​కు రోజుకు 50 లీటర్లు, నయారా బంకులలో 70–200 లీటర్ల వరకు పరిమితి విధించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్​పీసీఎల్ కూడా ఇదేబాట పట్టే అవకాశం ఉంది. 

రిటైల్ ధరలు తక్కువగా ఉండటంతో పారిశ్రామిక వినియోగదారులు కూడా సాధారణ బంకుల్లో డీజిల్ ​కొనడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రిటైల్ డీజిల్, బల్క్ డీజిల్ మధ్య రూ.40 వరకు ధర తేడా ఉంది. ఫ్యాక్టరీలు, టెలికాం కంపెనీలు, హోటళ్లు, ఆసుపత్రులు వంటి బల్క్ కస్టమర్లు భారీగా కొంటుండంతో ఇబ్బందులు వస్తున్నాయి.