కర్ఫ్యూ నిబంధనపై ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ సంచలన నిర్ణయం

కర్ఫ్యూ నిబంధనపై ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ సంచలన నిర్ణయం

లండన్‌‌‌‌: ఇంగ్లండ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ జట్టు కొత్త కెప్టెన్‌‌‌‌ జో రూట్‌‌‌‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మెన్స్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ జట్టుపై అమల్లో ఉన్న అర్ధరాత్రి కర్ఫ్యూ నిబంధనను రద్దు చేశాడు. జట్టులో క్రమశిక్షణ కోసం గతంలో విధించిన ఈ ఆంక్షలను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. గత శీతాకాలంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో జరిగిన కొన్ని వివాదాస్పద ఘటనల నేపథ్యంలో మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ ఈ కర్ఫ్యూను అమలోకి తెచ్చాడు. టెస్ట్‌‌‌‌ జట్టు మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ మ్యాచ్ ముగిసిన తర్వాత అర్ధరాత్రి బయట తిరగడంతో కొన్ని అనివార్య సంఘటనలు జరిగాయి.

 ఈ నేపథ్యంలో స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో రూట్ మళ్లీ ఇంగ్లండ్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టాడు. ‘జట్టుపై ఎలాంటి కర్ఫ్యూ ఉండదు. దీనిని పెద్ద విషయంగా నేను భావించడం లేదు. ఆటగాళ్లు మైదానంలో బాధ్యతాయుతంగా ఆడాలంటే, మైదానం వెలుపల కూడా పెద్దవాళ్ళలా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోగలగాలి. ఆటగాళ్లంతా పెద్దలు. ఇంగ్లండ్ తరఫున ఆడేటప్పుడు వారి బాధ్యతలు ఏమిటో వారికి బాగా తెలుసు’ అని రూట్ స్పష్టం చేశాడు.