న్యూఢిల్లీ: ఖేలో ఇండియా కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ గవర్నమెంట్ ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను.. రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపారిశ్రామిక, మత్స, యువజన సర్వీస్‌లు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆహ్వానించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏజీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేనా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీ సోనీ బాలాదేవి ఇందులో పాల్గొన్నారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
తెలంగాణలో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి తెలంగాణను దేశ క్రీడా పటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
